శ్రీ వేంకటేశ్వరునికి విన్నపం
న:భూతో, న: భవిష్యతి అనే విధముగా ,
సర్వలోకానికి ప్రత్యక్ష దైవముగా ,
సర్వ భక్త జనులతో గోవిందా అను పిలువబడగా ,
శ్రీ భూ సతులతో ఏడు కొండలపై అలరారుతున్న
ధర్మపరిరక్షణా చక్రవర్తి అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఇవే మా నమః సుమాంజములు.
పేద , ధనిక అను బేధం లేదు ,
కులం , మతం అనే తారతమ్యం లేదు ఆ భగవంతుడికి .
శ్రీ వారి చెంత ఇంతటి మహత్కార్యం అనగా శ్రీ వారి గురించి సంక్లిప్తముగా వ్రాయగల అదృష్టం .
దొరుకనా ఇటువంటి సేవ , దొరకునా ఇటువంటి భగవత్ సంకల్ప శక్తి.
గోవిందా ! గోవిందా !.....
స్వామి ఏడుకొండల వాడ , వేంకటరమణా అనగానే , మన మొర ఆలకించి ,
సకల కార్యములను దిగ్విజయముగా జరుగుగాక అని దీవించగలరు వారు , ఈ శ్రీవారు ..
గోవిందా , నీ శరణు కోరగా వచ్చామయ్యా ! మమ్మల్ని మీరే కాపాడాలి దేవుడా !..
ఆపద మ్రొక్కుల వాడ అని వేలాది భక్త జనుల నోటి నుంచి జాలు వారే ఆ పదజాలములను ఆలకించి ,పిలువగా,
పలకగా , ఒక ధైర్యం , ఆత్మస్త్యైర్యం నింపి మనస్సులో ,
ఎల్లప్పుడూ మీ వెంటే వున్నాను అని చెప్పగల ఒక దివ్యరూపం గల శ్రీ వారికి ,
ఏ విధముగా ఆయనకు నేను (మనము) సేవ చేయగలము .
ఒక అరవై సంవత్సరముల అమ్మమ్మ శ్రీ వారి దర్శనం కోసం , కొన్ని వేల మెట్లు ఎక్కగల శక్తి , ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది స్వామి !!...
నీవు ఎక్కడున్నావు అనే భక్తజనులుకు ఇంతటి చక్కటి ఉదాహరణ చూపించగల మహత్యం , మీకే చెందునుయ్యా గోవిందా!!!!
నీ చెంతకు వచ్చే ప్రతి పుష్పం , ప్రతి ఒక్క మనస్సు అది నీకు దాసోహం బ్రహ్మాండనాయకా !
సాక్షాత్తు ఆ బ్రహ్మ తోనే ఉత్సవాలు జరిపించుకోగల భగవంతుడివయ్యా ,
సరిలేరు మీకెవ్వరు హరి , శ్రీ హరి !
" ఇందుగలడు అందుగలడు సందేహం వలదు !
ఏందేందు వెతికిన అందందే గలడు " అని ఏ మహా కవి నుంచి జాలువారాయో ఈ పదములు.
పదములను సైతం నిజం చేయగల మహత్యం నీకే చెందునుయ్యా .
గోవిందా నిన్ను కలవటానికి ఈ భక్త జనం వచ్చారయ్యా అని పిలవగానే గజమాల ధరించి , శేష పాన్పు పై పవళించి వున్నా మీరు , ఒక సెకను ఆలస్యం చేయక , నేనున్నాను అని అందరి మొరలు ఆలకించి , నిత్యం విశ్రాంతి లేకుండా అడిగిన కోరికలు తీర్చే మా కలియుగ ప్రత్యక్ష దైవమా , అందుకో ఈ సామాన్య భక్త జనుల నమఃసుమాంజములు
-- అలసిపోయిన మనస్సుకు ఒక చల్లటి గాలితో పలకరిస్తావు , ఏమిటయ్యా ఆ లీల !!!
-- మిమ్మల్ని చూసిన కొలది మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే ఆ రూపం , ఒక మధురం ,
చూస్తున్న మా ఈ భక్త కోటికి ఒక మధురానుభూతి ఆహా !!!
-- పునఃజన్మ ప్రాప్తిరస్తు అని చెప్పే ఆ ఆలయ ద్వారములు గురించి ఏమని చెప్పను యెంతని చెప్పను .
-- భక్తులు నీ దగ్గరికి కోరికలతో నీ గర్భగుడి ద్వారము వరకు రాగలరు ,
కానీ వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గర్బా గుడిలోకి వచ్చి మిమ్మల్ని చూడగానే కోరికలు ప్రక్కన పెట్టి , రెండు చేతులతో గోవిందా !!! గోవిందా !!! కాపాడు స్వామి ! ఏడుకొండలవాడా
వెంకటరమణా అని మాత్రమే చెప్పగలరు , అందరు అదే చెప్పగలరు ,
ఎందుకంటే మానవుని కోరికలు అతీతం అని మీకు తెలుసు . అవి ఎలా తీర్చాలో ఎప్పుడు తీర్చాలో మీకు బాగా తెలుసు .
అందరి మనస్సు లో నుంచి వచ్చే మీ నామ స్మరణ మనసుకు హత్తుకొనే విధముగా సర్వ జగత్ రక్షకుడిగా తిరుమల గిరులపై ఎంచక్కగా వెలిశావయ్యా ! ఆహ !!!!
ఒక దేవదేవుణ్ణి గురించి చెప్పడమంటే మాటలా ? పదములు సరిపోవు , ఏవి సరితూగవు మీతో స్వామి !!!
తిరుమల గిరులపై వెలసే ప్రతి ఒక్క మెట్టు , పుట్ట , బ్రతికే జీవకోటి రాసులు , పరిమళించే పుష్పములు మీయొక్క సంకల్పమే .
నిత్య కళ్యాణం - పచ్చ తోరణం చూడటానికి మా ఈ రెండు కన్నులు సరిపోవు స్వామి !౧
మీ కళ్యాణం చూస్తున్నపుడు , మా భక్తులు ఎంత పారవశ్యం అవుతారో !!
ఆ కైంకర్యములు , ఆ మంత్రోచ్ఛారణముల మధ్య , శ్రీ భూ సతుల నడుమ చూడ ముచ్చటైన ఆ చిన్ని చిరునవ్వు , ఎంతటి మనస్సు అయినా ఒక్క సారి మిమ్మల్ని చూడగానే , సాక్ష్యాత్ దేవదేవుని కళ్యాణం మనము చూస్తున్నామా అని ఆనంద బాష్పలతో , రెండు పెదవుల నుంచి వచ్చే గోవింద నామ స్మరణ ! ఆహా !!..... ఎంతటి చక్కటి అవకాశం కల్పించావు నాయన అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు స్వామి !!!!
అవునయ్యా !! పద్మావతి మాత మిమల్ని చూడకుండానే కేవలం మీ నామ స్మరించగానే , మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారే ఎంతటి గొప్పవారయ్యా మీరు .
పద్మావతి మాత మీ మీద మనస్సు పడి, మీ ధర్మపత్ని అయి సర్వ సమస్తానికి ఒక అండగా నిలుస్తున్న అమ్మవారికి ఇవే మా నమస్కారములు !!!
పంచ భూతాలను సైతం శాసించగల శక్తి .
ధర్మాన్ని పరిరక్షించగల ఒక దైర్యం ,
పిలవగానే , పలుకుతారు అనే ఒక అండ ,
ఇవన్నీ ఉండగా , ఎందుకయ్యా పేదవాడు పేదవాడు లాగా , ధనికుడు ధనికుడు లాగా ఉంటున్నారు,
సాధ్యమైనంత వరకు ఈ పేద-ధనిక అనే వ్యత్యాసం తగ్గించి , ధర్మాన్ని పరిరక్షించే భాద్యత మా మీ భక్తులకు కలిగించవయ్యా !!
మీ కిరీటంలో పొదుగబడిన ఒక్కొక్క వజ్రం నుంచి వచ్చే ఆ కాంతి ఒక్కొక్క శక్తి గా ,
మీరు ధరించిన పూలమాలలు నుంచి విరాజిల్లే ఆ సువాసనలు , మనస్సుకు ఒక ప్రశాంతతగా ,
పండితులు పలికే వేదమంతొర్చ్చారణ, ఒక విన్నపం గా ,
మిమ్మల్ని చూసి తరించి మేము మంత్రోముగ్ధులయ్యే విధముగా దర్శన భాగ్యం కల్పిస్తున్న ,
శ్రీదరుడా!! మాధవా !! కేశవా !! రఘునందనా !!
దండాలయ్యా స్వామి ! దండాలయ్యా !!
శంఖు-చక్రములు ధరించిన మీ రూపం ,
పసుపు-చందనముల స్నానములు ,
పాలు-తేనెల అభిషేకములు
లడ్డు-వడలు ల నైవేద్యములు ,
ఆకాశమా ! భూలోకమా ! అనే తిరుమల గిరుల నడుమ , మీ నుదుటి పై ఉన్న తిరునామం చూస్తుంటే , మా శ్రీనివాసునికి భక్తుడిగా ఏ సేవ చేయగలను అని ఆలోచించకనే ఆలోచిస్తున్నాను .
మీరు ప్రసాదించిన ఈ మానవ జన్మకు మీ సేవ లో ఒక భాగముగా కల్పించి , పేద-ధనిక అను వ్యతాసం తగ్గించుట లో మాకు ఒక అవకాశం కల్పించమని వేడుకొంటున్నాము స్వామి !
సదా మీసేవలో
-----మీ భక్తులం
Comments
Post a Comment